గుప్త నిధుల తవ్వకాల కలకలం
బేల మండలంలోని శంషాబాద్ గ్రామ శివారులో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరపడం స్థానికంగా కలకలం రేపింది. గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు శంషాబాద్ శివారులోని ఓ పంట పొలంలో గుంత తవ్వి, పూజలు చేశారు. గమనించిన పొలం యజమాని వెంటనే సమాచారాన్ని పోలీసులకు తెలియచేశారు. ఎస్సై రాధిక మంగళవారం అక్కడికి చేరుకొని జెసిబి సహాయంతో గుంతను తవ్వి తీశారు. ఈ మేరకు గుంత ఖాళీగా ఉండడంతో అక్కడున్న వారు ఊపిరి పీల్చుకున్నారు.