నేరడిగొండ మండలంలోని గుత్పాల గ్రామస్తులు సోమవారం బోథ్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ ఆడే గజేందర్ ను ఆయన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సన్మానించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో నెలకొన్న సమస్యల గురించి, గ్రామానికి ప్రధాన రోడ్డు సౌకర్యం గురించి విన్నవించారు.