
తాంసి: పెట్రోల్ బంక్ నిర్మాణ స్థలాన్ని పరిశీలించిన అదనపు కలెక్టర్
తాంసి మండలం హస్నాపూర్ గ్రామ సమీపంలో నూతనంగా నిర్మించనున్న పెట్రోల్ బంక్ నిర్మాణ స్థలాన్ని మంగళవారం అదనపు కలెక్టర్ శ్యామల దేవి పరిశీలించారు. బంక్ నిర్మాణానికి సంబంధించిన భూమిని సందర్శించి ధ్రువీకరణ పత్రాలు పరిశీలించారు. ఆమెతో పాటు తహశీల్దార్ లక్షీ, ఆర్ఐ సంతోష్, సర్వేయర్ ప్రసాద్, మాజీ సర్పంచ్ నర్సింగ్ ఉన్నారు.