గుడిహత్నూర్ బౌద్ధ మహాసభ కమిటీ ఎన్నిక
గుడిహత్నూర్ మండల కేంద్రంలోని బౌద్ధ నగర్ లో సోమవారం బౌద్ధ మహాసభ కమిటీ ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ ప్రభాకర్ గడపాలే, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రత్నజాడే ప్రజ్ఞాకుమార్ పాల్గొని గుడిహత్నూర్ అద్యక్షుడి కిషన్ బుద్దె, ప్రధాన కార్యదర్శి శంకర్ మాతన్కర్, కోశాధికారి నరహరి బుద్దె, ఉపాధ్యక్షులు సిద్దార్థ్ కాంబ్లే, మహిళ అధ్యక్షురాలు వాగ్మారే మీనాబాయి లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.