తెలంగాణలో గిరిజన విద్యార్థులను అన్ని రంగాల్లో ముందుండేలా తీర్చిదిద్దాలని మంత్రి సీతక్క సూచించారు. సోమవారం గిరిజన సంక్షేమశాఖపై సమీక్ష సమావేశంలో మాట్లాడారు. 'చిన్నప్పుడు నేను హాస్టల్‌లో ఉన్నా.. ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నా. హాస్టల్ విద్యార్థులంటే చులకన భావం ఉంటుంది. అవహేళన చేసేవారికి గుణపాఠం చెప్పేలా చదువుకుని ఉన్నత స్థానాలకు ఎదగాలి' అన్నారు. వసతిగృహాల్లో వస్తువులు సరిగా లేవని, నాసికరం కొనుగోళ్లపై విచారణ జరిపిస్తామని అన్నారు.