
బోథ్: మద్యం మైకంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య
గుడిహత్నూర్ మండలంలోని మచ్చాపూర్ గ్రామానికి చెందిన ఒకరు మద్యం మైకంలో పురుగుల మందు తాగి మృతి చెందినట్లు ఎస్సై మహేందర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మచ్చాపూర్ గ్రామానికి చెందిన నైతం పాండు(35)కు 12 సంవత్సరాల కమలాబాయితో వివాహం జరిగింది. పాండు మద్యానికి బానిసై ప్రతి రోజూ మద్యం తాగి వచ్చి తాగిన మైకంలో కుటుంబ సభ్యులను కొట్టేవాడు. బుధవారం మృతుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసారు.