ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
గుడిహత్నూర్ మండల కేంద్రంలో ఆదివారం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదిలాబాద్ ఆర్టీసీ డిపోకి చెందిన ఎక్స్ ప్రెస్ బస్సు ఆదిలాబాద్ నుండి నిర్మల్ కు వెళ్తుంది. గుడిహత్నూర్ బ్రిడ్జ్ సమీపంలో ఆర్టీసీ బస్సు లారిని ఓటెక్ చేయ క్రమంలో బస్సును వెనుక నుంచి లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎవరికి ఏమి కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం వేరే బస్సులు వారిని గమ్యస్థానాలకు తరలించారు.