అనారోగ్యంతో బాధపడుతూ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం తానూర్ మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం నంద్గాం గ్రామానికి చెందిన నగేష్ (40)గత కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చికిత్స చేయించుకున్న తగ్గకపోవడంతో మనస్తాపం చెంది ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.