చింతలమానెపల్లి: డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించిన ఎస్ఐ
చింతలమానెపల్లి మండల కేంద్రంలో ఎస్ఐ ఇస్లావత్ నరేష్ అధ్వర్యంలో శనివారం రాత్రి వాహనాల తనిఖీ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ నరేష్ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, ఆటోలలో పరిమితికి మించి ప్రయాణం చేయకూడదని తెలిపారు. వాహనాలకు సంబంధించి ధృవీకరణ పత్రాలు వెంట ఉంచుకోవాలని ఎస్ఐ తెలిపారు.