దీపావళి తరువాత వచ్చే ఆరవ రోజున ఉత్తర భారతీయులు జరుపుకొనే 'ఛట్ పూజలు కాగజ్‌నగర్ పట్టణంలోని ఎస్పీఎం క్రీడామైదానంలో గురువారం సాయంత్రం ప్రారంభమయ్యి శుక్రవారం సూర్యోదయానికి ముగిసాయి. సూర్యదేవుడికి రెండురోజుల పాటు కఠోరదీక్ష చేపట్టి కొలనులోకి దిగి దీపాలు వెలిగించి నైవేద్యంగా పండ్లు సమర్పించారు. తమ కుటుంబం సుభీక్షంగా ఉండాలని, పిల్లాపాపలతో సంతోషంగా ఉండాలని మహిళలు సూర్యభగవానునికి ఛట్ పూజలు చేస్తారు.