కాగజ్‌నగర్‌లోని ఓల్డ్ కాలనీలో శనివారం కొనసాగుతున్న సమగ్ర కుటుంబ సర్వే ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ అంజయ్యతో కలిసి సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లా శనివారం పరిశీలించారు. సబ్‌కలెక్టర్ మాట్లాడుతూ. సర్వేలో కుటుంబ సభ్యుల వివరాల్లో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లు సమన్వయంతో పని చేయాలని అన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.