గంజాయి కేసులో నలుగురు అరెస్ట్
తలమడుగు మండలం లక్ష్మీపూర్ చెక్ పోస్ట్ వద్ద ఇటివల 900 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు జిల్లా పోలీసులు. కేసును ఛాలెంజింగ్‌గా తీసుకుని ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకుంటున్నారు. ఈ మేరకు గంజాయిని సరఫరా చేస్తున్న మహారాష్ట్రకు చెందిన మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ప్రధాన సూత్రధారులను త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఆదిలాబాద్ డీఎస్పీ జీవన్ రెడ్డి మీడియాకు శుక్రవారం తెలిపారు.