రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందిన సంఘటన ఆదిలాబాద్ లో చోటుచేసుకుంది. తలమడుగు మండలం ఖోడద్ కు చెందిన ఎల్మ రాకేష్ రెడ్డి ఆదిలాబాద్ లో నివాసం ఉంటున్నాడు. శనివారం తన భార్య రుతుజ, కూతురు వరణ్య, కియారా తో ద్విచక్ర వాహనంపై జైనథ్ మండలం దీపాయిగూడకు వెళ్తుండగా ఆదిలాబాద్ శివారులోని గణేష్ మందిరం వద్ద మరో ద్విచక్ర వాహనం ఢీకొని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలైన రుతుజ రెడ్డి దుర్మరణం చెందారు.