కేరళలోని అయ్యప్ప స్వామి భక్తుల కోసం ఏఐ చాట్‌బాట్‌ను అందుబాటులోకి తెచ్చారు. పతనంతిట్ట జిల్లా యంత్రాంగం అభివృద్ధి చేసిన ఈ చాట్‌బాట్ లోగోను సీఎం పినరయి విజయన్ బుధవారం ఆవిష్కరించారు. ఆరు భాషలైన మలయాళం, ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళం, కన్నడలో శబరిమల గురించి సమగ్ర సమాచారాన్ని ‘స్వామి చాట్‌బాట్’ అందిస్తుంది. శబరిమలలో పూజా సమయాలతోపాటు రైల్వే, విమాన సౌకర్యాలను తెలియజేస్తుంది.