ఏపీ మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. 16 వేల పైచిలుకు పోస్టుల భర్తీ కోసం త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని అసెంబ్లీలో ఆయన ప్రకటించారు. 11 డీఎస్సీల ద్వారా 1.5 లక్షల టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశామని తెలిపారు. అందులో 9 డీఎస్సీలు చంద్రబాబు హయాంలోనే నిర్వహించినట్లు గుర్తు చేశారు. మెగా డీఎస్సీపైనే తొలి సంతకం పెట్టామని, ఉద్యోగాల భర్తీ త్వరలోనే పూర్తి చేస్తామని అన్నారు.