18వ లోక్ సభ తొలి సెషన్ సమావేశాలకు సర్వం సిద్ధం

82చూసినవారు
18వ లోక్ సభ తొలి సెషన్ సమావేశాలకు సర్వం సిద్ధం
18వ లోక్ సభ తొలి సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. కొత్తగా ఎన్నికైన లోక్ సభ సభ్యులతో 24, 25 తేదీల్లో ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. 26న లోక్ సభ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. 27న ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. 28 నుంచి రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై పార్లమెంట్ లో చర్చ ఉంటుంది.

ట్యాగ్స్ :