నీట్ పేపర్ లీక్ పై సీబీఐ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. నీట్ పై వస్తున్న ఆరోపణలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయనున్నట్లు సీబీఐ అధికారులు తెలిపారు. బీహార్ లో జరిగిన నీట్ పేపర్ లీక్ తో పాటు గ్రేస్ మార్కులపై దర్యాప్తు చేపట్టనుంది. నీట్’ పేపర్ లీక్ ఆరోపణలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికే యూజీసీ-నెట్ లీక్‌పై కేసు నమోదు చేసిన సీబీఐ విచారణ చేపట్టింది.