ప్లాస్టిక్‌కు బదులు ప్రస్తుతం విభిన్న రకాల పర్యావరణహిత బాటిల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ’గాజు బాటిల్స్, సెరామిక్ బాటిల్స్, స్టీల్ బాటిల్, పేపర్ బాటిల్స్, మట్టి బాటిల్స్, వెదురు బాటిల్స్, కాపర్ బాటిల్స్, పాకెట్ మగ్ వంటి నీటి సీసాలను ఉపయోగించేలా ప్రజలను ప్రోత్సహించాలి’ అని నిపుణులు సూచిస్తున్నారు.