ఇజ్రాయెల్‌కు భారీ షాకిచ్చిన అమెరికా

67చూసినవారు
ఇజ్రాయెల్‌కు భారీ షాకిచ్చిన అమెరికా
ఇజ్రాయెల్‌కు భారీ షాక్ తగిలేలా ఉంది. వాషింగ్టన్ నుంచి అందాల్సిన కీలక ఆయుధాల షిప్‌మెంట్‌ను నిలిపేసినట్లు సమాచారం. ఒక్కోటీ 900 కేజీల బరువుండే 1800 బాంబులు, 226 కేజీల బరువుండే మరో 1700 బాంబులు ఇప్పుడు టెల్‌అవీవ్‌కు అందవు. ఈ విషయాన్ని బైడెన్ కార్యవర్గంలోని కీలక అధికారి ధ్రువీకరించారు. రఫాలో పౌరుల భద్రతపై అమెరికా ఆందోళనలు పట్టించుకోని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్