‘అమిత్ మాల్వియాను పదవి నుంచి తొలగించాలి’ (Video)

68చూసినవారు
బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియాపై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనేత్ సంచలన ఆరోపణలు చేశారు. మాల్వియా మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్నారు. అమిత్ మాల్వియాను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని సుప్రియా డిమాండ్ చేశారు. ఆయన పదవిలో కొనసాగితే స్వతంత్ర విచారణ సాధ్యం కాదని అన్నారు. మాల్వియాను పదవి నుంచి తొలగించనంతవరకూ బాధితులకు న్యాయం జరగదని ఆమె పేర్కొన్నారు.