నార్కోటిక్స్ కో ఆర్డినేషన్‌పై అన్ని రాష్ట్రాల సీఎస్‌లు, హోంశాఖ ముఖ్య కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులతో కేంద్ర హోం మంత్రి అమిత్‌షా వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరభ్ కుమార్ ప్రసాద్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, సీఐడీ చీఫ్ రవి శంకర్ అయ్యన్నార్ తదితరులు పాల్గొన్నారు. గంజాయి, మాదకద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఏపీ సీఎస్ వివరించారు.