ఢిల్లీ నుంచి శాన్ ఫ్రాన్సిస్కో వెళ్తున్న ఎయిర్ ఇండియాకు చెందిన ఏఐ 183 విమానంను అత్యవసరంగా రష్యాలో దించారు. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఆ విమానాన్ని క్రాస్కోయార్క్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ చేశారు. ఈ విమానంలో 225 మంది ప్రయాణికులు, 19 మంది సిబ్బంది ఉన్నారు. క్రాస్కోయార్క్ విమానాశ్రయంలో ఉన్న ఎయిర్ ఇండియా ప్రయాణికులను సురక్షితంగా శాన్ ఫ్రాన్సిస్కో చేర్చేందుకు ప్రత్యేక విమానాన్ని పంపుతున్నారు.