రిటైర్మెంట్ ప్రకటించిన 3రోజులకే జట్టులోకి అండర్సన్

73చూసినవారు
రిటైర్మెంట్ ప్రకటించిన 3రోజులకే జట్టులోకి అండర్సన్
ఇంగ్లండ్ దిగ్గజ బౌలర్ జేమ్స్ అండర్సన్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. అయితే రిటైర్మెంట్ ప్రకటించిన మూడు రోజులకే జిమ్మీ మళ్లీ జాతీయ జట్టులో చేరారు. అతడిని ఇంగ్లండ్‌కు బౌలింగ్‌ మెంటార్‌గా నియమించటంతో గురువారం నుంచి మొదలుకాబోయే రెండో టెస్టు నుంచే అతడి విధులు మొదలవబోతున్నాయి. కాగా, 2012 తర్వాత ఇంగ్లండ్ క్రికెట్‌ జట్టు టెస్టుల్లో బ్రాడ్‌, అండర్సన్‌ లేకుండా ఆడనుండటం ఇదే తొలిసారి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్