తీవ్ర భావోద్వేగానికి గురైన అందెశ్రీ (వీడియో)

13438చూసినవారు
పదేళ్ల నిరీక్షణ తర్వాత అందెశ్రీ రాసిన 'జయ జయహే తెలంగాణ' పాట తెలంగాణ రాష్ట్ర గీతంగా పభుత్వం ఆమోద ముద్ర వేసింది. చాలా సంవత్సరాల తర్వాత ఆయన పాటకు గుర్తింపు రావడంతో పరేడ్ గ్రౌండ్​లో గీతం వింటూ అందెశ్రీ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని అంటూ వస్తున్న పాట వింటూ అందెశ్రీ కంట కన్నీటితో ఆలకిస్తూ భావోద్వేగం చెందారు. గీతాన్ని వింటున్నంత సేపు ఆయన కళ్లలో కన్నీరు ఆగలేదు.