వింటర్ సీజన్‌లో ఇమ్యూనిటీని పెంచే ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి. దీంతో రోగాలు దరిచేరకుండా ఉంటారు. అలాగే త్వరగా జీర్ణం అయ్యే ఆహారాలనే తీసుకోవాలి. దీని వల్ల మీ జీర్ణ వ్యవస్థ చక్కగా పని చేస్తుంది. అందుకోసం మనం తీసుకునే ఆహారంలో మెంతి కూర ఉండాలి. దీంతో మంచి పోషకాలు శరీరానికి లభిస్తాయి. పచ్చి బఠాణీలు, బీట్ రూట్, క్యారెట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దీనివల్ల రోగ నిరోధక శక్తి మెరుగు పడుతుంది. పాలకూర తీసుకోవడం కూడా మంచిదే.