న్యూయార్క్‌లోని స్టోని బ్రూక్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫరా మన్జూర్ 5-10 నిమిషాల కంటే ఎక్కువ సమయం కమోడ్ పై ఉండకూడదని సూచించారు. టాయిలెట్‌పై ఎక్కువసేపు కూర్చుంటే రక్తప్రసరణకు ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో పురీషనాళం చుట్టూ ఉండే సిరలు, రక్తనాళాలు పెద్దవిగా మారి మొలలకు దారితీస్తాయి. అలాగే కంటి కండరాళ్ళు బలహీనపడతాయని టెక్సాస్ యూనివర్సిటీ వైద్యులు హెచ్చరిస్తున్నారు.