కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంకా గాంధీ వాద్రా లోక్ సభలో అడుగుపెట్టారు. వాయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో విజయం సాధించిన ప్రియాంకా ఈరోజు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు ఆమెతో స్పీకర్ ఓం బిర్లా ప్రమాణ స్వీకారం చేయించారు. అప్పుడామె చేతిలో రాజ్యాంగ ప్రతి పట్టుకున్నారు. భర్త రాబర్ట్ వాద్రా, కుమార్తె మిరియా, కుమారుడు రైహన్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఈ వేడుకకు హాజరయ్యారు.