భార్యభర్తల మధ్య గొడవ.. అడ్డొచ్చిన కొడుకుపై కత్తితో దాడి

59చూసినవారు
భార్యభర్తల మధ్య గొడవ.. అడ్డొచ్చిన కొడుకుపై కత్తితో దాడి
భార్యభర్తల మధ్య గొడవ.. కొడుకు ప్రాణం తీసింది. గొడవ పడొద్దని అడ్డుగా వచ్చిన తనయుడిపై తండ్రి కోపంతో దాడి చేశాడు. ఈ ఘటన బుధవారం బెంగళూరులో జరిగింది. బసవరాజ్‌ అనే వ్యక్తి తన భార్యతో గోడవకు దిగాడు. ఈ క్రమంలో గొడవను శాంతింపజేయాలని అతని కొడుకు యశ్వంత్‌ ప్రయత్నించాడు. అయితే ప్రమాదవశాత్తు తండ్రి కత్తితో యశ్వంత్‌ ను పొడిచాడు. దీంతో యశ్వంత్‌ మృతి చెందాడు. మృతుడు సర్జాపూర్‌లోని ఓ ప్రైవేట్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.