ఐదేళ్ల బాలుడిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన హైదరాబాద్ లోని కూకట్ పల్లి పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. కలకత్తా నుంచి భవన నిర్మాణ పనుల నిమిత్తం వచ్చిన కార్మికుడి కుమారుడు జంతర్ (5)పై పండ్ల వ్యాపారం చేసుకునే ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. బాలుడి నోరుమూసి కత్తితో బెదిరించి బలవంతంగా బాత్రూంలోకి తీసుకెళ్లాడు. దీంతో బాలుడు కేకలు వేశాడు. స్థానికులు, కుటుంబ సభ్యులు గమనించి బాలుడిని కాపాడారు. నిందితుడికి దేహశుద్ధి చేశారు.