ఏపీలో దారుణం.. తమ్ముడి చేతిలో అన్న హతం

64చూసినవారు
ఏపీలో దారుణం.. తమ్ముడి చేతిలో అన్న హతం
శ్రీకాకుళం జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. సంతబొమ్మాళి మండలానికి చెందిన రమేశ్‌(31), సురేశ్‌(25) అనే అన్నదమ్ములిద్దరు టీ షర్ట్ కోసం జరిగిన వాగ్వాదం.. అది కాస్తా ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో అన్నను తమ్ముడు సురేశ్‌ నెట్టివేయడంతో తలకు రాయి తగిలింది. దీంతో తీవ్రగాయం కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ట్యాగ్స్ :