బైక్ రైడ్ ఎంజాయ్ చేస్తున్న ఎలుగుబంటి(వీడియో)

78చూసినవారు
చాలామంది తమ పెంపుడు జంతువులను తమతో పాటు బైక్‌, కార్లలో తీసుకెళ్తుంటారు. కానీ ఓ వ్యక్తి బైక్‌పై ఏకంగా ఎలుగుబంటిని షికారుకు తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. రష్యాలోని అర్ఖంగెల్స్క్ లో ఉండే ఓ వ్యక్తి బైక్‌ సైడ్‌కార్‌లో ఓ భారీ ఎలుగుబంటిని సిటీ వీధుల్లో షికారుకు తీసుకెళ్లారు. వేగంగా వెళ్తున్న బైక్ పై ఎలుగుబంటి ఎంజాయ్ చేస్తూ గాల్లోకి చేతులు లేపింది. ఈ వీడియోని 1.18 కోట్ల మందికి పైగా వీక్షించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్