సంపన్నులే షాకయ్యేలా.. 20 వేల మందికి బిచ్చగాడి విందు!

58చూసినవారు
పాకిస్థాన్‌లో సంపన్నులు సైతం ఆశ్చర్యపోయే రీతిలో ఓ బిచ్చగాడి కుటుంబం కళ్లు చెదిరిపోయేలా విందును ఏర్పాటు చేసింది. ఓ బిచ్చగాడి నాన్నమ్మ ఇటీవల చనిపోయింది. 40వ రోజు ఆమె జ్ఞాపకార్థం ఆ కుటుంబం రూ.1.25 కోట్ల వ్యయంతో ఏకంగా 20వేల మందికి పసందైన వంటకాలతో విందు ఏర్పాటు చేసింది. అతిథులను వేదిక వద్దకు తరలించేందుకు 2వేల వాహనాలు, 250 మేకలను వధించినట్లు తెలిసింది. ఈ ఈవెంట్‌ గురించి తెలిసి సంపన్నులు సైతం ఆశ్చర్యపోతున్నారు.

సంబంధిత పోస్ట్