బ్రెజిల్ అధ్యక్షతన రియో డి జనీరోలో మొదలైన జీ20 సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆకలి, పేదరికంపై పోరాటానికి అంతర్జాతీయ కూటమి ఏర్పాటు కోసం బ్రెజిల్ చూపుతున్న చొరవకు మద్దతు ఇస్తున్నట్లు మోదీ వెల్లడించారు. ఢిల్లీ వేదికగా నిర్వహించిన జీ20 సదస్సులో తీసుకున్న ప్రజా కేంద్రీకృత నిర్ణయాలను బ్రెజిల్ ముందుకు తీసుకెళ్లిందని ప్రధాని కితాబిచ్చారు.