Top 10 viral news 🔥
తాగుబోతు హల్చల్.. కుక్కపిల్లకు వైద్యం చేయాలని వాగ్వాదం (వీడియో)
ప్రభుత్వ ఆస్పత్రికి కుక్కపిల్లను తీసుకొచ్చి వైద్యం చేయాలంటూ ఓ తాగుబోతు హల్చల్ చేసిన ఘటన ఏపీలోని కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చోటు చేసుకుంది. మద్యం సేవించిన ఓ వ్యక్తి ప్రభుత్వ ఆస్పత్రిలోని ఔట్ పేషంట్ విభాగానికి వచ్చాడు. కుక్క పిల్లకు నీరసంగా ఉందని, వైద్యం చేయాలని కోరాడు. అతడి వాలకం చూసిన వైద్యులు పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పారు. అయినా ఆ వ్యక్తి మాట వినలేదు. దాంతో సెక్యూరిటీ సిబ్బంది అతడ్ని బయటకు పంపించారు.