జిమ్ ట్రైనర్ హత్య కేసులో బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు అరెస్ట్

68చూసినవారు
జిమ్ ట్రైనర్ హత్య కేసులో బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు అరెస్ట్
ఢిల్లీ జిమ్ ట్రైనర్ హత్యకేసులో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సభ్యుడు యోగేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను పట్టుకునేందుకు ఢిల్లీ, మథుర పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ క్రమంలో ఆగ్రా-మథుర హైవేపై పోలీసులు, యోగేశ్‌కు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో యోగేశ్ కాలికి బుల్లెట్ గాయం అయ్యింది. దీంతో అతడిని పోలీసులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్