ఏపీలో సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన మద్యం షాపుల లాటరీ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. మద్యం దుకాణాల లాటరీలో అనంతపురం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సందిరెడ్డి శ్రీనివాసులు పంట పండింది. లాటరీలో ఆయన ఏకంగా ఐదు దుకాణాలను దక్కించుకున్నారు. పుట్టపర్తిలో కలెక్టర్ చేతన్ ఆధ్వర్యంలో తీసిన లాటరీలో ఆయనకు ధర్మవరం మున్సిపాలిటీలో 1, రూరల్‌లో 4, 12.. ముదిగుబ్బ మండలంలో 19, బత్తలపల్లి మండలంలో 14వ నెంబర్ దుకాణాలు దక్కాయి.