ఉడికించిన పెసర్లు తింటే ఆరోగ్యానికి చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. వీటిలో విటమిన్ C, విటమిన్ K, ఐరన్, క్యాల్షియం, పొటాషియం, మెగ్నీషియం ఇంకా కాపర్ వంటి పోషకాలు ఉంటాయి. ఉడికించిన పెసర్లను తినడం వల్ల కండరాలు బలంగా తయారవుతాయి. మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణక్రియ సమస్యలు తొలగుతాయి. మలబద్ధకం సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది.