24 గంటల్లో ఆరు విమానాలకు బాంబు బెదిరింపులు

80చూసినవారు
24 గంటల్లో ఆరు విమానాలకు బాంబు బెదిరింపులు
దేశంలో గత 24 గంటల్లో ఆరు విమానాలకు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. బెదిరింపులకు గురైన ఆరు విమానాలు వేర్వేరు విమానాశ్రయాలు, వేర్వేరు మార్గాల్లో ఉన్నాయి. బెదిరింపుల కారణంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బాంబు బెదిరింపు రావడంతో ఆరు విమానాలు మార్గమధ్యంలో ల్యాండ్ కావాల్సి వచ్చింది. వీటిలో ఒకటి కెనడాలో ల్యాండ్ అయ్యింది. భద్రతా తనిఖీల్లో ఈ విమానాల్లో బాంబులు లేదా అనుమానాస్పద వస్తువులు లభించలేదు.