TG: హైదరాబాద్ ఉప్పల్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లక్ష్మీ మాధవి స్థానికంగా ఓ వ్యక్తికి బుద్ధి వచ్చేలా చేశారు. తాగొచ్చిన తండ్రిని ఉద్దేశించి కొడుకుతో.. 'నాన్న.. నాకు నువ్వు కావాలి. నువ్వు మరో సారి తాగి బండి నడపవద్దని ప్రమాణం చేయి' అని తండ్రిని కదిలించేలా ఆమె ప్రామిస్ చేయించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు మాధవిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.