'ఈ వ్యవస్థ ఒక పడవలాంటిది. రంద్రాలున్నాయని ప్రతి ఒక్కరికీ తెలుసు. కానీ, నువ్వు మునిగిపోయే పడవను కాపాడాలనుకుంటున్నావు. నువ్వూ చస్తావు చౌదరీ..' అంటూ ఆసక్తిని పెంచింది 'పాతాళలోకం 2' ట్రైలర్. 'పాతాళలోకం' వెబ్ సిరీస్ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో రెండో సీజన్‌ను తెరకెక్కించారు. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. తొలి భాగాన్ని మించి ప్రేక్షకులను అలరించేలా సీజన్-2 తీర్చిదిద్దినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.