భారత్, హిమాచల్ ప్రదేశ్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ రిషి ధావన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. వైట్‌బాల్ క్రికెట్‌కు సోషల్ మీడియా వేదికగా రిటైర్మెంట్ ప్రకటించాడు. విజయ్ హజారే ట్రోఫీ 2024-25 గ్రూపు స్టేజి నుంచి హిమాచల్‌ప్రదేశ్ నిష్క్రమించిన వెంటనే ధావన్ తన నిర్ణయాన్ని వెల్లడించాడు. ‘పరిమిత ఓవర్ల క్రికెట్‌కు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నాను. కానీ అన్ని ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని తెలిపాడు.