TG: బీఆర్ఎస్వీ స్టేట్ సెక్రటరీ నాగారం ప్రసాద్‌ను నార్సింగి పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలను డబ్బులు ఇవ్వాలని ప్రసాద్ ముఠా బెదిరిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. అడ్మిషన్‌తో పాటు రూ.పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. కాలేజీల యాజమాన్యాలపై బెదిరింపులకు దిగుతున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ మేరకు ప్రసాద్‌ను నార్సింగి పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు.