పాక్ డ్రోన్‌లను స్వాధీనం చేసుకున్న BSF

56చూసినవారు
పాక్ డ్రోన్‌లను స్వాధీనం చేసుకున్న BSF
పంజాబ్‌లోని తర్న్ తరన్ జిల్లా సరిహద్దులో పాక్‌కు చెందిన డ్రోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) శనివారం తెలిపింది. పంజాబ్ పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించింది. జూన్ 20న రాష్ట్రంలో పాకిస్థాన్ డ్రోన్‌లను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఆ డ్రోన్లు చైనాలో తయారైనట్లు వివరించింది. అమృత్‌సర్ జిల్లాతో పాటు తర్న్ తరన్ జిల్లాలో ఆ డ్రోన్లు పట్టుబడ్డాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్