ఈ రోజుల్లో ఉద్యోగం కోసం ఎంత కష్టపడినా చాలిచాలని జీతాలు వస్తున్నాయంటూ చాలా మంది సొంత వ్యాపారాలు ప్రారంభిస్తున్నారు. కొందరెమో వ్యాపారం పెట్టాలనుకున్నప్పటికీ పెట్టుబడి లేదని తమ ఆలోచనను విరమించుకుంటుంటారు. అయితే తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు వచ్చే వ్యాపారాలు చాలానే ఉన్నాయి. వాటిలో బ్యూటీ పార్లల్, టీ స్టాల్, పచ్చళ్ల తయారీ, ఆహారం తయారీ, యూట్యూబ్ ఛానల్ నిర్వహణ వంటివి ఉన్నాయి.