బెంగళూరులో చంద్రశేఖర్ (39) అనే క్యాబ్ డ్రైవర్ తన భార్యను గొంతు కోసి చంపాడు. అనంతరం నేరం అంగీకరించి సంపిగేహళ్లి పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయాడు. తన భార్య ప్రవర్తనపై అనుమానమే హత్య వెనుక ప్రాథమిక ఉద్దేశ్యమని పోలీసులు తెలిపారు. చంద్రశేఖర్ భార్య తరచూ ఫోన్‌లో మాట్లాడుతుండటం వల్ల అతనికి అనుమానం పెరిగిందన్నారు. వీరికి ఇద్దరు కుమారులు. ఈ ఘటన జరిగిన సమయంలో ఇద్దరు కుమారులు స్కూల్లో ఉన్నారని తెలిపారు.