మూర్చలో దాదాపు 40 రకాలున్నాయి. కొందరిలో కేవలం చేతులు మాత్రమే ఉలిక్కిపడ్డట్లు (ఒక జర్క్)గా కదులుతాయి. ఇంకొందరు స్పృహ కోల్పోరు గాని, కాసేపు అచేతనంగా ఉండిపోతారు. మరికొందరిలో వారి ప్రవర్తనలో మార్పులు వస్తాయి. ఫిట్స్ ఐదు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో వస్తే అవి మెదడుకు హానిచేయవు. అయితే కొందరు నాలుకను బలంగా కొరుక్కుంటారు. పంటివరసకు గాయం, భుజం విరగడం, తలకు గాయం కావడం వంటివి జరగవచ్చు.