మెదడుకు గాయం, మెదడుకు ఆక్సిజన్ సరిగా అందకపోవడం వల్ల ఫిట్స్ వస్తుందని ప్రముఖ న్యూరాలజీ నిపుణులు డాక్టర్ పీ.రంగనాథం చెబుతున్నారు. మందులు సరిగ్గా వాడని వారిలోనూ ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇవే కాకుండా ఇతర కారణాలు ఉంటాయని, వాటిని తెలుసుకునేందుకు MRI పరీక్ష చేసుకోవాలని సూచిస్తున్నారు.