త్వరలో రైతుల అకౌంట్లోకి నగదు

31598చూసినవారు
త్వరలో రైతుల అకౌంట్లోకి నగదు
తెలంగాణలో వడగళ్లు, అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లింపులకు ఈసీ అనుమతి ఇచ్చినట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. 10 జిల్లాల్లో 15,814 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు అంచనా వేసిన అధికారులు.. త్వరలోనే చెల్లింపుల ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. ఎకరానికి రూ.10వేల చొప్పున నష్టపోయిన రైతులకు రూ.15.81 కోట్ల పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. అత్యధికంగా కామారెడ్డి జిల్లాలో 10,328 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు గుర్తించారు.