రక్తనాళాల్లో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే ఆరోగ్యం క్షీణిస్తుంది. కొలెస్ట్రాల్ పెరగడం వల్ల అధిక రక్తపోటు, మధుమేహం, గుండెపోటు వంటి ప్రమాదకరమైన జబ్బులు చుట్టుముట్టే అవకాశం ఉంది. అయితే కొలెస్ట్రాల్ సమస్యను అవకాడోతో నియంత్రించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. అవకాడోలో పొటాషియం విటమిన్లు బీ,ఈ, సీ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతాయని వివరిస్తున్నారు.