మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్ రైల్వే స్టేషన్‌లో బీఎస్ఎఫ్ జవాన్లు, ఆర్పీఎఫ్ పోలీసుల మధ్య ఘర్షణ చెలరేగింది. జవాన్లు ఓ మహిళా కానిస్టేబుల్‌తో అసభ్యంగా ప్రవర్తించడంతో ఈ గొడవ మొదలైంది. పోలీసులు, జవాన్లు వాగ్వాదానికి దిగారు. ఈ ఘటనలో సైనికుల్లో ఒకరి తలపై బలమైన గాయాలయ్యాయి. అక్కడ ఉన్న వారు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు.